|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:24 PM
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం రద్దయిన నేపథ్యంలో సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు పలాష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. "నాపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాష్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. "నా గురించి, నా కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని ఆయన స్పష్టం చేశారు.
Latest News