|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:10 PM
టాలీవుడ్ హీరోయిన్ సోనారిక బడోరియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.. పలువురు విషెష్ చెబుతున్నారు. ఈ నెల 5న పాపకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'దేవోం కే దేవ్ మహాదేవ్' సీరియల్లో పార్వతీదేవిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనారిక.. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ ను పెళ్లి చేసుకున్నారు.
Latest News