|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:43 AM
ప్రముఖ బెంగాలీ నటుడు కళ్యాణ్ ఛటర్జీ(81) కన్నుమూశారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ మోషన్ పిక్చర్ ఆర్టిస్ట్స్ ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. టైఫాయిడ్‌తో పాటు వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఛటర్జీ ఆదివారం రాత్రి ఎంఆర్ బంగూర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 400కు పైగా చిత్రాలలో, ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించిన ఈయన 1968 లో విడుదలైన అపోంజోన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Latest News