|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 01:51 PM
‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి, ‘బేబమ్మ’గా పేరుగాంచిన కృతి శెట్టి, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సహనటుడు నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యతో పనిచేస్తున్నప్పుడు తనకు అత్యంత సౌకర్యంగా అనిపిస్తుందని, ఆయన నిజాయితీ తనకు బాగా నచ్చుతుందని, మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతారని కృతి తెలిపింది. ‘బంగార్రాజు’, ‘కస్టడీ’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట మధ్య మంచి స్నేహం ఉందని కృతి మాటలను బట్టి అర్థమవుతుంది.
Latest News