|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:26 PM
ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 30 కోట్ల మోసం కేసుకు సంబంధించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్‌పూర్‌కు చెందిన ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని డాక్టర్ అజయ్ ముర్దియా చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.విక్రమ్ భట్ దంపతులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత వారిని ఉదయ్‌పూర్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులకు పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 8 లోగా హాజరుకావాలని ఆదేశించారు.
Latest News