|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:35 PM
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజ్ పిన్ని, ప్రముఖ గాయని శోభారాజు వీరి వివాహం, సమంత క్రమశిక్షణపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఆహారం విషయంలో సమంత ఎంతో క్రమశిక్షణతో ఉంటుందని శోభారాజు తెలిపారు. “సామ్ డైట్ గురించి వింటే భయమేసేది. ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది. మూడు నెలలకు ఒకసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని తెలిసింది. ఆమె ఆధ్యాత్మిక చింతన, ఫిట్‌నెస్ పట్ల నిబద్ధత గొప్పవి” అని శోభారాజు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. తన అక్క కుమారుడైన రాజ్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా క్రమశిక్షణతో ఉంటాడని, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
Latest News