|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:43 PM
నటి జాన్వీ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు.ఈ మేరకు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని షేర్ చేశారు. దీనికి "#TheGirlfriend. Mandatory Watch" (తప్పకుండా చూడాలి) అని క్యాప్షన్ జోడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Latest News