|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:46 PM
టాలీవుడ్‌లో మరో నూతన కథానాయకుడు అడుగుపెడుతున్నాడు. 'జై లవకుశ', 'జెంటిల్ మెన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నివేదా థామస్ సోదరుడు నిఖిల్ థామస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రానికి 'బెంగళూరు మహానగరంలో బాలక' అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.మహి - రాజ్ దర్శక ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బెంగళూరు నేపథ్యంలో సాగే ఈ కథకు సంబంధించిన పోస్టర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పవన్ కల్యాణ్ 'పంజా' సినిమా ఫస్ట్ లుక్, సత్యం కంప్యూటర్స్, 'కొలవెరి డి' పాట వంటి అంశాలను పోస్టర్‌పై పొందుపరచడంతో ఇది ఒకప్పటి కాలాన్ని ప్రతిబింబించే కథగా తెలుస్తోంది. సయా క్రియేషన్స్, ఫాల్కన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అఖిల్ యమ్మన్నగారి, ఎంఎస్ఎన్ మూర్తి, సీహెచ్ వీ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Latest News