|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 04:01 PM
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో విజయం సాధించిన అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సిరి హనుమంత్, పృథ్వీ రాజ్ వంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Latest News