by Suryaa Desk | Sat, Aug 10, 2024, 08:07 PM
ప్రముఖ మరాఠీ సినీ నటుడు విజయ్ కదమ్ (67) శనివారం చనిపోయారు. గత ఏడాదిన్నరగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంధేరీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్ కదమ్ మృతితో మరాఠీ చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 1980లలో హాస్య పాత్రలతో ప్రేక్షకులను ఆయన అలరించారు. హలద్ రుస్లీ కుంకు హాసలం, లవు కా లాత్, చష్మే బహదూర్ వంటి అనేక చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్నారు.
Latest News