![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jan 29, 2025, 02:14 PM
‘గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్ అల్లు అరవింద్‌గారు. ఆయన లేకుండా మరో సినిమా చేయగలనా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా విషయంలో ఆయనో మార్గదర్శిలా నిలిచారు’ అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న విడుదలకానుంది. మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానంగా ట్రైలర్ ఆకట్టుకుంది. ‘మా యాసను ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే’ అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. నాగచైతన్య మాట్లాడుతూ ‘నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం.అందుకే ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇక్కడ సినిమాకు కలెక్షన్స్ షేక్ అవ్వాలి. ఫిబ్రవరి 7న థియేటర్లో రాజులమ్మ జాతరే’ అన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్‌ఫార్మెన్స్ కనబరిచారని, కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించారు.
Latest News