|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:16 PM
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది. తమ సేవల్లో స్థిరమైన, బలమైన మెరుగుదల కనిపిస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలను పునరుద్ధరించే పనుల్లో వేగం పెంచామని, పరిస్థితిని చక్కదిద్దుతున్నామని పేర్కొంది.శనివారం సుమారు 1,500 విమానాలు నడపగా, ఆదివారం ఆ సంఖ్యను 1,650కి పైగా పెంచినట్లు ఇండిగో వెల్లడించింది. కేవలం 30 శాతంగా ఉన్న విమానాల సమయపాలన (OTP) ఒక్కరోజులోనే 75 శాతానికి మెరుగుపడిందని వివరించింది. గత రెండు రోజులుగా తమ నెట్‌వర్క్‌ను స్థిరీకరించేందుకు పలు కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే అందిస్తున్నామని, దీనివల్ల వారి ఇబ్బందులు తగ్గుతున్నాయని పేర్కొంది.