|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:41 AM
హైదరాబాద్‌ను తిరిగి ‘భాగ్యనగరం’గా పేరు మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తన ట్వీట్‌లో, ప్రభుత్వం పేరు మార్పులపై ఆసక్తి చూపుతున్నట్లయితే, చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ పేరునే ప్రథమంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ AI విగ్రహాల తయారీలో బిజీగా ఉండగా, రేవంత్ రెడ్డి ట్రెండింగ్‌లో ఉన్నవారి పేర్లను రోడ్లకు పెడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా, US కాన్సులేట్ రోడ్డుకు ప్రెసిడెంట్ ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో పేర్లతో రహదారులకు పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.