నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని బుధవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6వేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం అధికారి చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa