రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఓయో రూంలో సౌమ్య, ఓంకార్ అనే ప్రేమ జంట నిన్న అద్దెకు తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓంకార్ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రియుడు ఓంకార్ బేగంబజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.