ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 06:37 PM

మాలధారణం నియమాల తోరణం.. జన్మ తారణం దుష్కర్మ వారణం.. శరణం శరణం శరణం శరణం.. అని అయ్యప్పస్వామి మాలధారణ గురించి ఎంతో గొప్పగా స్తుతిస్తుంటారు. అంటే.. మాల వేసుకోవటమనేది ఎన్నో నియామాలతో కూడుకున్న ఓ పవిత్ర యజ్ఞంలాంటింది. ఎన్నో చెడు కార్యాలను నివారింపజేసి జన్మను ధన్యం చేసుకునే అద్భుత కార్యం. అలాంటి అయ్యప్ప మాల ధరించిన ఓ స్వామి.. ఈ మాటలను తుంగలో తొక్కి ఆ మాలధారణ పవిత్రను భగ్నం చేస్తూ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. మాల ధరించిన స్వాములు చీమకు కూడా హాని తలపెట్టకూడదన్న నియమాన్ని మరిచి.. తన సొంత భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘోరం.. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


ప్రతాప సింగారం గ్రామంలో భార్య నిహారిక (35)ను భర్త శ్రీకర్ రెడ్డి బండ రాయితో తలపై కొట్టి చంపేసిన ఘటన సర్వత్రా సంచలనంగా మారింది. ఈ ఘటన సోమవారం (డిసెంబర్ 30) అర్ధరాత్రి చోటుచేసుకుంది. శ్రీకర్ రెడ్డి ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండగా.. ఇలాంటి ఘోరానికి పాల్పడటం శోచనీయం.


బోడుప్పల్ టెలీఫోన్ కాలనీకి చెందిన నిహారికకు 2017లో ఖమ్మం జిల్లా తిరమలపాలెం మండలం కాకరై గ్రామానికి చెందిన బండారు శ్రీకర్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉన్నారు. నిహారికకు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఓ ఇల్లు కొనిచ్చారు. ఈ ఇంటి విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి.. ఇద్దరికీ పలుమార్లు ఘర్షణ జరిగింది. తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఇల్లు అంటూ నిహారిక పదే పదే ప్రస్తావిస్తుండటం శ్రీకర్ రెడ్డికి నచ్చేది కాదు. దీంతో.. ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవలు తలెత్తేవి.


ఇదేక్రమంలో సోమవారం (డిసెంబర్ 30న) రాత్రి కూడా నిహారిక, శ్రీకర్ రెడ్డి మధ్య ఇంటి గురించి వాగ్వాదం చోటుచేసుకోగా.. అది కాస్త చిలికి చిలిక ఘర్షణగా మారింది. అయ్యప్ప మాలలో ఉన్న శ్రీకర్ రెడ్డి.. సహనం కోల్పోయేంత స్థాయికి ఆ గొడవ చేరుకుంది. దీంతో.. క్షణికావేశంలో భార్య నిహారిక తలపై బండ రాయితో కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. భర్తపై భార్య డామినేషన్ వల్లే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రథమనికంగా నిర్ధారించినట్టు సమాచారం.


సాధారణ సమయాల్లో ఎలా ఉన్నా.. దేవుని మాల ధరించినప్పుడు మాత్రం మనుషులు చాలా నిష్ఠగా, ఓపకగా, సహనంగా, దైవ చింతనలో ఉంటారు. అది అంజనేయస్వామి మాల అయినా, అయ్యప్పమాల అయినా.. ఇంకా ఎలాంటి దైవానికి సంబంధించిన మాల అయినా ధరించినప్పుడు ఆ దీక్ష తీసుకున్నన్ని రోజులు.. ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. అబద్దాలు చెప్పకూడాదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండాలి. నిష్ఠతో ఉండాలి. ఎవరికీ మనసులో కూడా హాని తలపెట్టకూడదు. బ్రహ్మచర్యం పాటిస్తూ.. నిత్యం ఆ దైవనాస్మరణతో మనసు నింపుకోవాలి. మనసును మలినం లేకుండా చేసి.. మనలోని దైవత్వాన్ని మేల్కోల్పి.. స్వచ్ఛమైన మనిషిని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ మొత్తం మాలధారణ నియమాల సారం. ఇంత పవిత్రమైన మాలలు ధరించి కూడా చాలా మంది.. నియమాలను పట్టించుకోకుండా.. తమలోని కోపావేశాలు, స్వార్థాలతో ఆ మాలకు ఉన్న పవిత్రతను భగ్నం చేస్తున్నారు కొందరు వ్యక్తులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa