ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 04, 2025, 04:13 PM

బెజ్జుర్ మండలంలోని హెటీ గూడ గ్రామ సమీపన దట్టమైన అటవీ ప్రాంతంలో మణుక దేవాలయం వద్ద చేతి పంపు  (బోరింగ్) చెడిపోయి 2 నెలలు గడుస్తున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడడం లేదు. గ్రామస్తులు, బాటసారులు, చుట్టూ అటవీ, ఆ ప్రాంత ప్రజలకు రహదారి, ప్రక్కనే  దేవాలయం ఉంది.
వచ్చే వారికి కమ్మర్గాం, జిల్లెడ, మోర్లిగూడ, నందిగామ, మొట్లగూడ, రాంపూర్ ప్రజలు  ప్రతిరోజు బెజ్జుర్ మండల కేంద్రానికి నిత్యావసర  వస్తులకు వస్తూ పోతుంటారు. ఏ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చేతి పంపు  (బోరింగ్) ను  మరమత్తులు చేయాలనీ ఆ  ప్రాంత గ్రామ ప్రజలు, మొక్కులు చెల్లించుటకు వచ్చు భక్తులు కోరుచున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa