ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ రాజ్యమంటూ గుండాయిజమా....!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 01:07 PM

ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశం లో బి అర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం సిగ్గు చేటు అని ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
తమ పార్టీ నాయకులు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని కాంగ్రెస్‌ నాయకత్వం దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం రేవంత్‌ మాటలతో దాడులు చేస్తుంటే.. ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని  ప్రశ్నించారు.
పదేళ్లుగా బందైన ఆత్మహత్యలు మళ్లీ మొదలైనా.. ముఖ్యమంత్రికి మనసు రావడం లేదా అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే 2004 - 2014 వరకు అత్మహత్యల పరంపర కొనసాగింద న్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే  కొనసాగుతుందని మండిపడ్డారు.
అధికారం చేతిలో ఉన్నదని గూండాగిరీ ప్రదర్శించడం సిగ్గు చేటు అని చెప్పారు.అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని గెలుపు ఓటమి సహజం అని చెప్పారు. వచ్చే ఎలక్షన్ లో  బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
బి అర్ ఎస్ పార్టీ కార్యాలయాల పై దాడి చేయడం కాదు..మీరు ఎలక్షన్ మందు ప్రకటించిన ఆరు గ్యారంటీ లు అమలు చేయడం పై దృష్టి పెట్టాలని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య,మండల బి అర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజు గౌడ్, పిర్ల పల్లి మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, లింగరెడ్డిపల్లి  మాజీ ఉప సర్పంచ్ బాలకిషన్, బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరాజు,లింగ రెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు కనకరాజు, గజం కుమార్, కనకయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa