నిండు శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రభుత్వం ఒక మధ్యంతర, రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిందని బుధవారం ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. ఇది అంకెల గారడీ తప్ప, ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా కళకళలాడిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa