జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో నిన్న భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.34 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. దేశంలో సంభవించే భారీ భూకంపాల నష్టాలపై ప్రభుత్వ నివేదిక విడుదలైన కొద్ది రోజులకే భూకంపం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ భూకంపం ప్రస్తుతానికి ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వెల్లడించారు. అయితే ఈ భూకంప ప్రభావం జపాన్ రాజధాని టోక్యో వరకు కనిపించింది.జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవిస్తే 1.81 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చు. సునామీల కారణంగా అనేక భవనాలు నేలమట్టం కావచ్చు, దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లవలసి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa