హైదరాబాద్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. చైతన్యపురి ప్రాంతంలో మనోజ్ (24) అనే యువకుడు స్కూటీపై వెళ్తుండగా.. తన స్నేహితుడు సంజయ్ కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో మనోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa