కేశంపేట మండలంలో జడ్పీహెచ్ఎస్ పాపిరెడ్డిగూడలో కొత్తపేట తెలంగాణ రైసింగ్ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపేట జెడ్పిహెచ్ఎస్ లో మండల విద్యాధికారి ఎం చంద్రశేఖర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ.. వేసవి సెలవులలో విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కొత్తపేటలో 40 మంది, పాపిరెడ్డిగూడెం 45, కేశంపేటలో 20 మంది విద్యార్థులతో హాజరయ్యారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు ఎవరైనా ఈ శిక్షణ శిబిరంలో ఉచితంగా చేరవచ్చును అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa