ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు-నిర్మల దంపతుల ఇంట్లో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో భోజనం చేశారు. ఇచ్చిన హామీల అన్నింటినీ అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.