తెలంగాణలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైంది. 2-5 సెకన్ల పాటు కంపనలు కొనసాగాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాలలో ఓ రైతు ఇల్లు కూలింది. నిపుణులు మరో భూకంప సూచన జారీ చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లి, చొప్పదండి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు మండలాల్లో.. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి, మల్లాపూర్, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో.. రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తి, కమాన్‌పూర్ మండలాలు, ఆసిఫాబాద్‌లోని రెబ్బెన మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం మండలా ల్లో భూప్రకంపనలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa