తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) కార్మికులు నిర్వహించ తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన చర్చలు సఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
కార్మికులు ఉంచిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారానే మార్గం కనుగొనవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. సమ్మె వల్ల ప్రయాణీకులకు తలెత్తే అసౌకర్యాన్ని నివారించగలిగామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa