ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాస

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:33 PM

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు వర్గం, సుజిత్ రావు వర్గాల మధ్య తీవ్ర వాగ్వintrexte: వాగ్వాదం జరిగింది. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ స్టేజిపై కూర్చోవడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. 
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa