జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమగ్ర మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కుంటాల మండలంలోని అందపూర్ గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండలలో పని చేస్తున్న కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా టెంట్లు, తాగు నీటి వసతి, ఆరోగ్య కిట్లు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ తనిఖీకి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి లు కూడా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa