గద్వాల నియోజకవర్గంలోని కె.టి.దొడ్డి మండలానికి చెందిన పాగుంట వెంకటాపురం గ్రామంలో భక్తుల సహకారంతో నిర్మితమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర్ స్వామి దేవాలయంలో తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ తాగునీటి బోరును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా స్విచ్ బోర్డ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చెట్లు, పూల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని గ్రామస్థులు ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa