భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది.
పూజ కార్యక్రమానికి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు తదితరులు హాజరై పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థించాం. సైనికులు సురక్షితంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,” అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa