ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ రూరల్ మండలంలోని భాగ్యనగర్‌లో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అభివృద్ధి కోసం రూ. 45 లక్షలు వెచ్చించి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa