కొత్తూరు మండలంలోని ఇమ్ములనర్వ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గుర్రంపల్లి శ్రీను యాదవ్ రూ. 1,10,000 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో ఆలయ అభివృద్ధి నిమిత్తం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "భగవంతుడి కృప భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆలయం గ్రామాభివృద్ధిలో భాగంగా నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాలి," అని తెలిపారు. గ్రామస్తులు ఆయన సానుకూలతను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa