గట్టు మండలంలోని చాగదోణ గ్రామంలో శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేమ, సహనం, త్యాగం, క్రమశిక్షణ, పరస్పర మత సహనం వంటి విలువలు నేటి సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. బక్రీద్ వంటి పవిత్ర పండుగలు ఈ విలువలను గుర్తు చేస్తాయని, ఈ పండుగను ముస్లింలు సంతోషంగా, ఐక్యంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత, మానవతా భావాలు మరింతగా పుష్కలంగా పెరగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa