ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. తన M సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ M17 5G’ మోడల్‌ను శుక్రవారం అధికారికంగా లాంచ్ చేసింది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో శక్తివంతమైన ఫీచర్లను అందిస్తూ, ముఖ్యంగా ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తామని ప్రకటించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. యువతను, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ మోడల్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499గా నిర్ణయించారు. అలాగే, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 13,999 కాగా, 8GB RAM + 128GB టాప్ వేరియంట్ ధర రూ. 15,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 13 నుంచి శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa