నటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. అనిల్ కామినేని ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వివరాలను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికతో పాటు ప్రత్యేక విల్లును మోదీకి అందజేశారు. ఫొటోలను పంచుకున్న రామ్‌చరణ్ “పీఎం మోదీజీ మార్గనిర్దేశం, క్రీడలపై ఆసక్తి విలువిద్యను ప్రపంచవ్యాప్తం చేస్తుంది” అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa