ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోకి రాబోతున్నారని లీకులు తెలిసాయి.వీళ్ల షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. లక్స్ పాప ఫ్లోరా మరియు కామనర్ శ్రీజ్ ఐదో వారం ఎలిమినేట్ అయ్యి హౌస్‌ను వీడారు. మరోవైపు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు రాబోతున్నారు. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే ఉండటం విశేషం. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎవరో, వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చూద్దాం.
*రమ్య మోక్ష : సోషల్ మీడియాలో పిక్సెల్స్ (ఊరగాయలు) బిజినెస్ ద్వారా ఫేమ్ పొందిన రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం హౌస్‌లోకి రాబోతుంది. రమ్యకు రెండు అక్కలు కూడా ఉన్నారు, వీళ్లంతా కలసి ఆన్లైన్ పిక్సెల్స్ బిజినెస్ చేస్తున్నారు. ఫిజికల్‌గా బలంగా ఉండటంతో, గొడవల విషయంలో వెనక్కు తగ్గనట్లు రమ్య ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు తెలిసిందే. హౌస్‌లోకి రావడంతో చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది.
*శ్రీనివాస్ సాయి:‘గోల్కొండ స్కూల్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ సాయి, తర్వాత హీరోగా పలు చిత్రాలు చేశాడు. అవి పెద్దగా హిట్ కాకపోవడంతో ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు లేవని తెలుస్తోంది. బిగ్‌బాస్ ప్రొడ్యూసర్స్ approach చేయగానే, అతను వెంటనే ఒప్పుకున్నాడు. కుర్రాడు కావడం వల్ల హౌస్‌లో లవ్ ట్రాక్స్ కనిపించే అవకాశముంది.
*నిఖిల్ నాయర్:‘గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నిఖిల్, ‘పలుకే బంగారమాయెనా’ సీరియల్లోనూ నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఫిజికల్‌గా బలంగా, సిక్స్ ప్యాక్‌తో ఉన్న అతను హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తాడని చెప్పవచ్చు. సీరియల్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలవగల అవకాశం ఉంది.
*గౌరవ్ గుప్తా:ప్రస్తుతం ‘గీత ఎల్ఎల్బీ’ సీరియల్ చేస్తున్న గౌరవ్ గుప్తా కూడా హౌస్‌లోకి వస్తున్నాడు. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో, లవ్ ట్రాక్స్ మరియు ఫిజికల్ టాస్కుల్లో మంచి పోటీ ఇస్తాడని అంచనా. చూడాలి, హౌస్‌లో ఏం చేస్తాడో.
*ఆయేషా జీనత్:వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా చెప్పుకునే అయ్యేషా జీనత్, ‘సావిత్రి గారి అబ్బాయి’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ రెండో సీజన్లో కూడా పాల్గొంది. గతంలో తమిళ బిగ్‌బాస్ షోలో కూడా హల్చల్ చేసిన అనుభవం ఉంది. హౌస్‌లోకి రాకమంతో ఆట మరియు గ్లామర్ రెండింటిలోనూ ప్రేక్షకులకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు.
*దివ్వల మాధురి:సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఫేమ్ పొందిన దివ్వల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కాస్త అనిశ్చితిలో ఉండింది. గతంలో ఆఫర్ వచ్చినప్పటికీ తిరస్కరించినట్లు చెప్పిన ఆమె, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీకు ఒప్పుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa