ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ట్రాక్ మరమ్మతులు.. 32 రైళ్లు రద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:26 AM

డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో లైన్ మరమ్మతుల కారణంగా.. వచ్చే శనివారం వరకు 32 రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, SEC-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్, డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. ADB-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-SEC వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయి. SEC-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa