తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే రాగల 3 గంటల్లో కూడా కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుందని IMD హెచ్చరించింది. కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa