అమీన్పూర్ : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.
మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ఆర్.ఆర్ హోమ్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు చంద్రకళ గోపాల్, కాలనీవాసులు పాల్గొన్నారు.