కరీంనగర్ జిల్లా గర్షకుర్తిలో బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌తో అప్పులపాలైన కత్తి శివ అనే యువకుడు వృద్ధ దంపతులైన గజ్జల శంకరయ్య (76), లక్ష్మి (70)లకు మత్తు మాత్రలు ఇచ్చి, లక్ష్మి మెడలోని పుస్తెలతాడును అపహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో వృద్ధుడు శంకరయ్య మృతి చెందగా, లక్ష్మి ఆరోగ్యం విషమంగా ఉంది. నిందితుడు రూ.1.85 లక్షలకు బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవడంతో పాటు మళ్లీ బెట్టింగ్‌లలో ఖర్చు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa