హైదరాబాద్‌లోని హిల్ట్ పాలసీతో ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచడానికి 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, ఈ బృందాలు రేపు, ఎల్లుండి ఆయా ప్రాంతాల్లో పర్యటించి, రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై నివేదికను ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa