సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాలను ఏలుతున్న నటులను కూడా చూస్తూనే ఉన్నాం. సినిమా రంగానికి తెలుగు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణ అలాంటిది. ఈ నేపథ్యంలో ప్రపంచస్థాయి సినిమా నిర్మాణానికి హైదరాబాద్ వేదిక అవుతోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో ఖర్చు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక సిటీలో సినిమా చూసే కల్చర్ కూడా వేగంగా మారుతోంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా.. వారికి సరికొత్త వినోదాన్ని, అనుభూతిని అందించడానికి అత్యాధునిక టెక్నాలజీతో థియేటర్లను నిర్మిస్తున్నారు. అలా నిర్మించిన పలు థియేటర్లు ఈ సంక్రాతి నాటికి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్‌లో సినిమా ప్రియులకు చాలా ఇష్టమైన ప్రదేశం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్సే. ఇక్కడ సినిమా ఫ్యాన్స్‌తో పండగ వాతావరణం ఉంటుంది. ఏ కొత్త సినిమా విడుదల అయినా ఇక్కడికి అనేక మంది ప్రేక్షకులు తరలివస్తారు. ప్రసిద్ధి చెందిన సంధ్య, సుదర్శన్ థియేటర్లు ఇక్కడే ఉన్నాయి. త్వరలో ఇక్కడి ఓడియన్ మాల్‌లో 8 స్క్రీన్లతో పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం అవుతోంది. ప్రైమ్ ప్లేస్‌లో ఉడంటంతో ఈ మాల్‌కు పెద్ద సంఖ్యలో సినిమా ప్రియులు వస్తారని, ఈ మాల్ వినోదానికి ప్రధాన కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.
2. లేక్‌షోర్ మాల్ - కూకట్‌పల్లి
కూకట్‌పల్లి వై జంక్షన్‌లో లేక్‌షోర్ మాల్ ఉంది. ఇందులో పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌లో 9 స్క్రీన్‌లు ఉంటాయి. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం వాసులకు ఈ మల్టీప్లెక్స్ సరికొత్త అనుభూతి అందించనుంది. ఇందులో తెలుగుతో పాటు జాతీయ అంతర్జాతీయ సినిమాలు కూడా ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి.
3. అల్లు సినిమాస్ - కోకాపేట
నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటైన కోకాపేటలో.. అల్లు సినిమాస్ సంస్థ 4 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు కానుండటం విశేషం. కాగా, జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన.. సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవతార్: ఫైర్ అండ్ యాష్'తో గ్రాండ్‌గా ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుందని తెలుస్తోంది.
4. అపర్ణ మాల్ - శంషాబాద్
కాగా, శంషాబాద్‌లోని అపర్ణ మాల్‌లో 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మల్టీప్లెక్స్ మార్చి 2026లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa