ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2026, 02:35 PM

తెలంగాణలో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భానుడి ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా వరుసగా 10 రోజుల పాటు 40-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa