ప్రతి రోజూ పాలు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ పాలు తాగితే జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. అజీర్ణ సమస్య కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. పాలు తాగడం వల్ల కొన్నిసార్లు విశ్రాంతి లేకపోవడం, అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి. చర్మ సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. రోజుకు మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగితే గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు.