టెక్నాలజీ రంగంలో పోటీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదిలావుంటే ట్యాబ్లెట్ మార్కెట్లో యాపిల్ కు గట్టి పోటీనిచ్చేందుకు చైనా కంపెనీ షావోమీ రంగంలోకి దిగింది. మెరుగైన ఫీచర్లతో కూడిన షావోమీ.. ప్యాడ్ 6ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఏడేళ్ల తర్వాత తిరిగి భారత మార్కెట్లో ట్యాబ్ తో వచ్చింది. చివరిగా షావోమీ ప్యాడ్ 5ని కీబోర్డ్, స్టైలస్ తో విడుదల చేయడం గమనించొచ్చు. అప్పట్లో ఆ మోడల్ కు మంచి స్పందనే వచ్చింది.
షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999. 8జీబీ ర్యామ్, 456జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉన్న వారికి రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్యాడ్ 11 అంగుళాల 2.8కే ఎల్ సీడీ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్ నెస్ ఇస్తుంది. హెచ్ డీఆర్ 10ప్లస్ డాల్బీ విజన్ కు స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో రక్షణ కల్పించారు.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉపయోగించారు. 8,840 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనికి 33 వాాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. వెనుక వైపు 13 మెగా పిక్సల్స్ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్స్ కెమెరా ఇచ్చారు. కస్టమ్ కీబోర్డ్, స్టైలస్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 6.51ఎంఎం మందంతో అతి పలుచగా ఉంటుంది. బరువు 490 గ్రాములు.