గుడ్డు పెంకులతో అనేక లాభాలు పొందవచ్చు. పెంకులో కాల్షియం కార్బొనెట్ అధికంగా ఉంటుంది. దీన్ని ఎరువుగా వాడవచ్చు. అలాగే గుడ్ల పెంకులను బాగా కడిగి పొడి చేసుకోవాలి. అందులో తేనె లేదా పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. దాంతో ముఖంపై గ్లో పెరుగుతుంది. పెంకు పొడిని పెరుగుతో కలిపి జుట్టుకు రాసుకుంటే బాగా మెరుస్తుంది. పెంకు పొడి, బేకింగ్ సోడా, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్‌లా చేసుకుని బ్రెష్ చేసుకుంటే దంతాలు మెరుస్తాయి.