నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. రెగ్యులర్గా నల్ల మిరియాలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. అందుకే ప్రతిరోజూ వంటల్లో నల్ల మిరియాలు ఉపయోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.