కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మేంగారం వద్ద మంగళవారం నవీన్అనే వ్యక్తి తన బావమరిది అయిన నీల స్వామి గొంతు కోయడంతో తీవ్ర గాయాలతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. గాయలైన నీలా స్వామి లింగంపెట్ మండలం బొనాల్ గ్రామానికి చెందిన వాడని తెలిసింది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.