మైలవరం మం, దొడియంకు చెందిన రేష్మ (25)కు 10ఏళ్ల క్రితం అమృత నగర్‌కు చెందిన అన్వర్ బాషాతో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. శుక్రవారం భర్త ఆమె వద్దకు వెళ్లి సరదాగా పార్కు వెళ్లామంటూ పిలిచాడు. ఎకో పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమిచంపి పూడ్చి పెట్టి, శనివారం స్టేషన్లో లొంగిపోయాడు.