దివ్వెల పండగ దీపావళిని భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. పలు దేశాలు దీపావళి పండగను అధికారకంగా సెలవు దినంగా ప్రకటించాయి కూడా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. అంతేకాదు సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ దీపావళి వేడుకలను నిర్వహించే సమయంలో అమెరికన్ మిలిటరీ బ్యాండ్ హిందీ భక్తిగీతమైన ‘ఓం జై జగదీష్ హరే’ని ప్లే చేస్తున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X లో వైరల్‌గా మారింది. గీతా గోపీనాథ్ అమెరికన్ మిలిటరీ బ్యాండ్ మెస్మరైజింగ్ వీడియోను షేర్ చేశారు.
అంతేకాదు యునైటెడ్ స్టేట్స్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దీపావళి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాలు దీపావళిని అధికారికంగా సెలవు దినంగా గుర్తించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం అమెరికాలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లు దివ్వెల కాంతిలో వెలుగొందాయి. నిత్యం బిజీగా ఉండే ప్రవాస భారతీయులు ఒక చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దీపావళిని భారత్‌లో అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు.
Happy Diwali from the White House! Together, may we show the power in the gathering of light. pic.twitter.com/IHKn2gvj5s
— The White House (@WhiteHouse) October 29, 2024