ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. 29 మంది చిన్నారులకు మరణశిక్ష, ఆకలి కోసం రోడ్డెక్కినందుకు

international |  Suryaa Desk  | Published : Sat, Nov 02, 2024, 11:42 PM

నైజీరియాలో ఘోరం జరిగింది. తినడానికి తిండిలేక.. ఆకలికి తాళలేక రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వారి పట్ల అక్కడి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది. రోడ్డెక్కి నిరసనలు చేసిన వారిని జైళ్లలో పెడుతూ.. వారికి శిక్షలు విధిస్తోంది. ఇందులో మరణశిక్షలు కూడా ఉండటం గమనార్హం. మొత్తం 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేయగా.. కోర్టు వారికి మరణశిక్షను ఖరారు చేసింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం సంచలనం రేపుతోంది. ఈ 29 మంది చిన్నారుల వయసు అంతా 14 ఏళ్ల లోపే ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ 29 మంది చిన్నారుల్లో నలుగురు పిల్లలు ఆకలికి తట్టుకోలేక కోర్టు మెట్లపైనే కుప్పకూలిపోవడం మరింత దారుణంగా మారింది.


ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఆహార నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. అక్కడి ప్రజలకు కనీసం తిండి కూడా అందించే పరిస్థితి లేదు. దీంతో ఓపిక నశించిన ప్రజలు.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలను నైజీరియా ప్రభుత్వం అణిచివేస్తోంది. నిరసనలు చేస్తున్నవారిపై కఠిన చర్యలకు దిగింది. ఆందోళనలో పాల్గొన్న వారికి ఏకంగా ఉరిశిక్షలు విధించడం సంచలం రేపుతోంది. నైజిరియాలో రికార్డుస్థాయిలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకలి సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో పాల్గొన్నందుకు అక్కడి పోలీసులు మొత్తం 76 మందిపై శుక్రవారం (నవంబర్ 2) రోజున కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.


76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసులు విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ 76 మందిలో 29 మంది చిన్నారులకు కూడా మరణశిక్ష పడటం కలిచివేస్తోంది. ఈ 29 మంది పిల్లల వయసు కేవలం 14 ఏళ్ల లోపే కావడం మరింత సంచలనంగా మారింది. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని మైనర్ల తరఫు లాయర్ చేసిన వాదనతో అక్కడి కోర్టు ఏకీభవించింది. దీంతో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో కఠినమైన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేసింది.


ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశమైన నైజిరియాలో ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. తిండి దొరక్క ప్రజలు వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఉపాధి, ఉద్యోగాలు, కడుపునిండా తిండి దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఆగస్ట్‌లో నైజీరియా యువత రోడ్డెక్కి నిరసనలు చేసింది. ఈ నిరసనల్లో 20 మంది యువకులను కాల్చి చంపగా.. వందలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 1970లో నైజీరియాలో మరణశిక్ష అమలులోకి వచ్చింది. అయితే 2016 నుంచి నైజీరియాలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు కాలేదు.


ఆఫ్రికాలో ముడి చమురుకు నైజీరియా ప్రసిద్ధి చెందింది. అయినా ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా నిలిచింది. ఆ దేశంలో రాజకీయ నేతలు.. నిత్యం చట్టసభల్లో అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రభుత్వాధినేతలు, రాజకీయ నేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుండటం ఒకవైపు.. మరోవైపు.. సామాన్య ప్రజలు మాత్రం ఆకలితో కేకలతో ప్రాణాలు విడుస్తుండటం నైజిరియాలో ప్రస్తుత పరిస్థితులకు దారి తీస్తోంది. ఇక 21 కోట్లకుపైగా జనాభా ఉన్న నైజీరియా.. ఆఫ్రికా ఖండంలో అతిపెద్దది కాగా.. ప్రపంచంలో అత్యంత ఆకలితో ఉన్న దేశంగానూ నిలిచింది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియా దేశాల్లో తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్న దేశం నైజీరియా కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కనీసం రోజుకు ఒకపూట భోజనం కూడా దొరకని దుస్థితిని నైజీరియా ప్రజలు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com